నల్లగొండ, జనవరి 03 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉన్న షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల క్యాంపస్ లో విద్యార్థినులకు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శశికళ శనివారం దుప్పట్లు పంపిణీ చేశారు. పేద విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో Hwos విజయలక్ష్మి, రమ్య, సుధా, స్వప్న, సుమలత, దూసరి భారతమ్మ, సత్యవతి పాల్గొన్నారు.