మునుగోడు, మార్చి 27 : గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణుకుమార్ అన్నారు. గురువారం మునుగోడు మండల పరిధిలోని కల్వలపల్లి బీజేపీ గ్రామ శాఖ ఆధర్యంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా, పూర్తిస్థాయిలో పథకాలను అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కల్వలపల్లి గ్రామంలో మహాలక్ష్మి, చేయూత పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాడ్ చేస్తూ దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొత్త శంకర్, పర్నె అంతిరెడ్డి, బూతు అధ్యక్షుడు కొండ శంకర్, పగిళ్ల సైదులు, ఉప్పరి నర్సింహా, గణేశ్. కాబంపటి శ్రీరాములు, బొడ్డు లింగయ్య, కాబంపటి భూపాల్, బొల్గురి రమేశ్, కొండ మల్లేశ్, గాదె ప్రశాంత్ పాల్గొన్నారు.