యాదగిరిగుట్ట, అక్టోబర్28 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కలిసి డైవర్షన్ రాజకీయాలకు తెర తీశారని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో పాటు రైతులకు రైతుబంధు, రుణమాఫీ, మహిళలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించినందుకు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు సోమవారం భిక్షమయ్యగౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది తన ఇంట్లో దావత్ చేసుకుంటే రాజకీయ కుట్ర కోణంలో రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ కుమ్మకై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయని మండి పడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ మచ్చలేని నాయకుడని, విదేశాల్లో విద్యనభ్యసించి ఇక్కడి ప్రాంతానికి విదేవీ పెట్టుబడులను తీసుకొచ్చిన ఘనత ఆయనదని తెలిపారు. ఓటుకు నోటుతోపాటు అనే క అక్రమాలకు పాల్పడిన సీఎం రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తే సహించేదని లేదన్నారు. ప్ర జలను తప్పదోవ పట్టించి కేటీఆర్ కుటుంబాన్ని అ భాసుపాలు చేసే కుటిల ప్రయత్నానికి రేవంత్‌రెడ్డి దిగాడని పేర్కొన్నారు. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఊరుకోరని తెలిపారు. ఈ దుశ్చర్యను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.