నల్లగొండ విద్యాభిభాగం (రామగిరి), ఏప్రిల్ 08 : మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత ఉప రాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో విద్యార్థులు ముందుకు సాగాలని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం వర్సిటీలోని తన ఛాంబర్ లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అలవాల రవితో కలిసి యూనివర్సిటీ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలోనే నిర్వహించే మహనీయుల జయంతి ఉత్సవాల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ఈనెల 11 నుంచి 14 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యమై విజయవంతం చేయాలని కోరారు.
– 11న ఉదయం 6 గంటలకు 5కే రన్. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో గల మహాత్మా పూలే విగ్రహం నుంచి చర్లపల్లి బైపాస్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు. అదేవిధంగా మధ్యాహ్నం వ్యాసరచన, వకృత్వ, షార్ట్ ఫిలిం, డాన్స్ పోటీలు.
– 12వ తేదీ మధ్యాహ్నం రంగోలి, క్విజ్, పెయింటింగ్, ఫేస్ పెయింటింగ్ పోటీలు. అదేవిధంగా కెరియర్ గైడెన్స్ పై అవగాహన సదస్సులు.
– 13వ తేదీ మధ్యాహ్నం పద్యం, పాటలు ఇతర అంశాలపై పోటీలు, అలాగే సోషల్ జస్టిస్ ఇన్ 21 సెంచరీపై సదస్సు (సింపోసియం)
– 14వ తేదీన సామాజిక పరివర్తనలో విశ్వవిద్యాలయ పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహణ.
కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులు ఈ నంబర్లలో 9885939289, 9490807300 సంప్రదించవచ్చు. లేదా యూనివర్సిటీ పని వేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు నిర్వహణ కమిటీ సభ్యులను స్వయంగా కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఉత్సవాల చైర్మన్ యూనివర్సిటీ సోషల్ సైన్ డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ హరీశ్‌కుమార్, యూనివర్సిటీ కాంపిటేటివ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ కె.శ్రీదేవి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ అరుణప్రియ, సుధారాణి, ప్రేమ్‌సాగర్, సబీనా హెరాల్డ్, సైన్స్ కళాశాల ప్రొఫెసర్ ఎం.వసంత పాల్గొన్నారు.
MGU : ఈ 11 నుంచి 14 వరకు ఎంజీయూలో మహనీయుల జయంతి ఉత్సవాలు