నాగారం, మార్చి 18 : ఈ నెల 20న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట రాక సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాగారం మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం బైక్ ర్యాలి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అసెంబ్లీలో దళిత స్పీకర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు పెట్టుకుని రైతుల పక్షాన ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు దిశా నిర్దేశం చేసేందుకు కేటీఆర్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమాన్ని నాగారం మండల ముఖ్య నాయకులు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ విద్యార్థి, యువజన, పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య, మండల నాయకులు కేశగాని అంజయ్య, చిల్లర చంద్రమౌళి, కూరం వెంకన్న, సంపేట అశోక్, దోమల బాలమల్లు, యారాల నర్సింహారెడ్డి, కోట సోమలింగం, ఈదుల కిరణ్, చిప్పలపల్లి సోమయ్య, యాదగిరి, చిప్పలపల్లి రాములు, కన్నెబోయిన మల్లేశ్, అనిల్ శ్రీను, సోమయ్య పాల్గొన్నారు.