గుండాల, అక్టోబర్ 29: మండలంలోని సుద్దాలలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. గ్రామంలో బుధవారం భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఉపసర్పంచ్ బత్తిని రవి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 18 కుటుంబాలకు చెందిన సుమారు 100మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సుద్దాల గ్రామ శాఖ అధ్యక్షుడు కొండపల్లి మొగులాల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎండీ.ఖలీల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందడి రామకృష్ణారెడ్డి, మాజీ జడ్పీ వైస్‌చైర్మన్ గడ్డమీది పాండరి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్ హాజరై కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ..కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డాయని, ఇచ్చిన హామీలు మరిచిపోయి ప్రజలను మోసం చేస్తోందన్నారు..గుండాల మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా చోద్యం చూస్తోందన్నారు. మంత్రి కోమటిరెడ్డ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య దద్ద మ్మ రాజకీయాలు చేస్తున్నారని, గుండాల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు. మందడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..6 గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో భువనగిరి ఎంపీగా, నేడు మంత్రిగా ఉన్నప్పటికీ గుండాల మండల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు.
పూటకో మాటచెబుతూ కాలం వెల్లదీస్తున్నారని, కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఎవరూ నమ్మడం లేదని, అన్నదమ్ములకే సఖ్యత లేదన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బుర్ర రాజు, బుర్ర లక్ష్మణ్, గడ్డమీది అశోక్, అంగిడి కిష్ట య్య, గడ్డమీది యాదగిరి, పొదల శేఖర్, మబ్బు యాదయ్య, మబ్బు గోపయ్య, మబ్బు గోపాల్, కట్కూరి చంద్రయ్య, గడ్డం ప్రశాంత్, మబ్బు నర్సింహా, బద్దుల ఎల్లయ్య, దీకొండ నర్సయ్య ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరబోయే నాయకుల ఇండ్లకు వెళ్లి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, బీఆర్ఎస్లో చేరవద్దని, కాంగ్రెస్ ముఖ్యనాయకులతో ఫోన్లు చేయించి, ప్రభుత్వ పథకాలు మొదట మీకే ఇస్తామని చెప్పించారు. కార్యక్రమంలో గనగాని అంజయ్య, బడక మల్లయ్య, మిర్యాల అయిలయ్య, ఏలే లింగం, మహోదయ్, కాసం నగేశ్, వేణుగోపాల్‌రెడ్డి, తోటకూరి భిక్షం పాల్గొన్నారు.