మునుగోడు, ఆగస్టు 15 : మునుగోడు మండలంలోని నిరుపేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మొత్తం 8 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ లయన్ నారబోయిన రవి మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలుగకుండా ఈ సైకిళ్లు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లయన్ పాలకూరి నర్సింహా, ట్రెజరర్ లయన్ మిర్యాల వెంకటేశం, 1వ వైస్ ప్రెసిడెంట్ మిర్యాల వెంకటేశ్వర్లు, 2వ వైస్ ప్రెసిడెంట్ అనంత స్వామి గౌడ్, సభ్యులు లయన్ మిర్యాల శ్రీనివాస్, లయన్ నారబోయిన సుధాకర్, లయన్ కుమార స్వామి, లయన్ మిర్యాల మధుకర్, లయన్ కొంగరి కృపానందం, పాఠశాల హెచ్ఎం అశోక్, ఉపాధ్యాయులు సత్తిరెడ్డి, అంబటి సత్తయ్య పాల్గొన్నారు.