కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరి కలెక్టరేట్, జూలై 19 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కొత్తగా నమోదు చేసుకునే రైతులు 22-6-2022నాటికి కొత్త పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండి 18-59ఏండ్ల వయసు (14-8-1963నుంచి 14-8-2004 పుట్టిన) రైతులు అర్హులని తెలిపారు.
కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు సంబంధిత శాఖ ఏఈఓను కలిసి రైతు నమోదు పత్రము, పట్టాదారు పాసు పుస్తకము, ఆధార్‌కార్డు, నామిని ఆధార్‌కార్డు పత్రాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.