త్రిపురారం, జులై 04 : సమస్యలు ఉత్పన్నమవకుండా భూ భారతి రైతు సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం త్రిపురారం మండల తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతు సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పీఓటీ, పేరు తప్పు, ల్యాండ్ తక్కువ ఎక్కువ దరఖాస్తులను విడివిడిగా ఏర్పాటు చేసుకో వాలన్నారు.
అలాగే రైతులకు 7 రోజుల కాల వ్యవధిలో డాక్యుమెంట్లు సమర్పించే విధంగా నోటీసులు జారీ చేయాలని తెలిపారు. నిజమైన రైతులకు అన్యాయం జరగకూడదని, గ్రామ గ్రామాన రైతుల చేతికి నోటీసులు స్వయంగా అందించి వారి వద్ద నుంచి డాక్యుమెంట్లను స్వీకరించాలన్నారు. ఆయన వెంట తాసీల్దార్ గాజుల ప్రమీల, నిడమనూరు తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, నాయబ్ తాసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐలు గుండెబోయిన సైదులు, బ్రహ్మదేవర సంతోష, సీనియర్ అసిస్టెంట్ కల్పన, సిబ్బంది ఉన్నారు.