బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఈ నెల 15 వ తేదీన బీ ఫారం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు నియోజకవర్గాల్లో బాధ్యతల పైన దృష్టి సారించింది. గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్చార్జిలుగా సీనియర్ నేతలను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
నల్లగొండ నియోజకవర్గానికి జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌కు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నాగార్జునసాగర్‌కు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్, హుజూర్‌నగర్‌కు ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డిలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.