పెన్‌పహాడ్, ఏప్రిల్ 22 : విద్యా సామర్థ్యాన్ని పెంపొందించినప్పుడే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలరని సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. మంగళవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మండల హైస్కూల్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమావేశంలో అభ్యసన సామర్ధ్యాలు. విద్యార్థినీ విద్యార్థుల ప్రగతి, బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే, వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని హైస్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రాణాళిక రూపకల్పన, సకాలంలో యూనిఫామ్‌లు అందజేత తదితర అంశాలపై డీఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నకిరేకంటి రవి, మండల నోడల్ అధికారి వసరాం నాయక్. కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు మల్లారెడ్డి, ప్రభాకర్. అనాజిపురం మోడల్ హైస్కూల్ ప్రిన్సిపాల్ కోడి లింగయ్య. కేజీబీవీఎస్ ఎస్ఓ ఆసియా జబీన్ బేగం పాల్గొన్నారు.