రామగిరి, సెప్టెంబర్ 04 : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా అందజేసే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు అనుబంధ ప్రభుత్వ కళాశాలల నుంచి నలుగురు అధ్యాపకులు ఎంపికయ్యారు. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించే వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా వీరు పురస్కారాలు అందుకోనున్నారు. ఎంజీయూ నుంచి సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.దోమల రమేశ్, నల్లగొండ ఎన్జీ కళాశాల తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వెల్దంది శ్రీధర్, ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటని అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఎన్.సి.సౌజన్య, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.జె.చిన్నబాబు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
Ramagiri : రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా నల్లగొండ నుండి నలుగురు ఎంపిక