దేవరకొండ, నవంబర్ 18 : అర్హులైన ప్రతి లబ్ధిదారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో 250 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు, 75 మందికి రూ.75 లక్షల విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్లు శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ బాబు, జయశ్రీ, మహ్మద్ హర్షద్, సంతోష, మాజీ ప్రజా ప్రతి నిధులు, మండల నాయకులు పాల్గొన్నారు.