నకిరేకల్, సెప్టెంబర్ 15 : మాజీ సైనికుడు, నటుడు, సినిమా ప్రొడ్యూసర్, మోటివేషనల్ స్పీకర్, నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బెల్లి జనార్ధన్ నందమూరి తారక రామారావు నేషనల్ అవార్డు -2025ను అందుకున్నారు. సమాజానికి తనవంతు చేస్తున్న సేవలను న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ గుర్తించి మదర్ సర్వీస్ సొసైటీ డాక్టర్ మల్లాద్రి ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం ఏపీలోని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
Nakrekal : బెల్లి జనార్ధన్‌కు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు-2025 ప్రదానం