మునుగోడు, మార్చి 29 : బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఏప్రిల్ 2న ఢిల్లీలో నిర్వహించే బీసీల పోరు గర్జనను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చే బిక్ష కాదని అది బీసీల హక్కు అన్నారు. అడుక్కుంటే రావు పోరాడితేనే వస్తాయని అంబేద్కర్ చెప్పినట్లు బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఢిల్లీపై దండెత్తుదామని పిలుపునిచ్చారు.