పెన్పహాడ్, మే 16 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో శుక్రవారం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ బడి బయటి పిల్లలు బడిలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం మల్లారెడ్డి, సంఘ బంధం అధ్యక్షురాలు షేక్ అలీమా, ఉపాధ్యక్షురాలు జె.ప్రవళిక, అంగన్వాడీ టీచర్ జానీబేగం, షేక్ మల్సూర్, ఖాదర్, యాకూబ్, నిర్మల, మహబూబా, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.