చివ్వెంల, ఏప్రిల్ 02 : ఈ నెల 5వ తేదీన సూర్యాపేట పట్టణంలో నిర్మించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రారంభించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్ర వీరస్వామి మాదిగ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండలంలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్వీ, ఎంజెఎఫ్, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళా నేతల కమిటి జిల్లా నాయకుడు గంట భిక్షపతి, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు కొంగల సతీశ్ మాదిగ, ఎంఎస్పీ మండలాధ్యక్షుడు కిరణ్ మాదిగ, కళానేతల కమిటి మండలాధ్యక్షుడు యాతాకుల రఘు మాదిగ, రాజు మాదిగ, కళ్యాణ్ మాదిగ, దురాజ్‌పల్లి వార్డు అధ్యక్షుడు మొండికత్తి గోపిచంద్ మాదిగ, గద్దల శ్రీకాంత్ మాదిగ పాల్గొన్నారు.