రామగిరి, ఏప్రిల్ 5: నేటి యువతకు దివంగత భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. నల్లగొండలో తొలుత ఎన్జీ కళాశాల ఎదుట పునఃనిర్మాణంచేసిన బాబు జగ్జీవన్‌రామ్, తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాలను జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలిసి ఆవిష్కరించారు. అనంతరం బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నవ భారత నిర్మాణంలో ఆయన ఒక శిల్పి అని ఆయన కొనియాడారు. ఆయన స్ఫూర్తిని దేశానికి మార్గదర్శనీయమన్నారు. దేశంలో బడుగు, బలహీన వర్గాలకు ఆదరణ లేని సమయంలోనే ఉన్నత చదువులు చదివి ఎందరికో ఆదర్శంగా నిలిచి ప్రజల పక్షంగా పోరాటలు చేశారని తెలిపారు. అలాగే నల్లగొండ ఎన్జీ కళాశాల ఆవరణలోని పెంటయ్య హాస్టళ్ల పునర్నిర్మాణం చేసి అక్కడే స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డిని ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేస్తామన్నారు. ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ ఉందని అక్కడ హాజరుకావాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల ఇక్కడ జరిగే ఉత్సవాల్లో పాల్గొనలేకపోతున్నట్లు తెలిపారు. ఇందుకు బదులుగా మరో రోజు డీఈఓ కార్యాలయం వద్ద పునర్నిర్మాణం చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణతోపాటు సహపంక్తి భోజనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్లు ఖుష్బూగుప్తా, భాస్కర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ్ధ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, స్థానిక కౌన్సిలర్ యమా కవితాదయాకర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సల్మాభాను, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, డీఎంహెచ్ఓ కొండల్రావు, వివిధ సంఘాలనాయకులు పాల్గొన్నారు.
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ : బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ సాయిబాబా ఆలయం పక్కనున్న జగ్జీవన్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు.
ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, భగత్
మిర్యాలగూడ/దేవరకొండ/హాలియా, ఏప్రిల్ 5 : బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్‌రామ్ చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, రమావత్ రవీంద్రకుమార్, నోముల భగత్ అన్నారు. బుధవారం జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా మిర్యాలగూడ, దేవరకొండ, హాలియాల్లో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి, చిత్రపటానికి ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం జగ్జీవన్‌రామ్ కృషి చేశారన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.