దామరచర్ల, ఏప్రిల్ 20 : డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహనా సదస్సును దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు. సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ లీటరసీ (Cfl) కో ఆర్డినేటర్ అనిల్ మాట్లాడుతూ.. అజ్ఞాత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలను, ఫోన్ కాల్స్ కు స్పందించవద్దన్నారు. అదే విధంగా ఓటీపీ, పిన్ నంబర్లను అనుమానిత వ్యక్తులకు తెలియజేయవద్దని, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల భారిన పడవద్దని ప్రజలకుర సూచించారు. డిజిటల్ బ్యాంకింగ్ వల్ల కలిగే ఉపయోగాలు, నష్టాలను వివరించారు. తప్పుడు మార్గాల ద్వారా మీ అకౌంట్లో నుండి డబ్బులు పోగొట్టుకున్నట్లయితే గోల్డెన్ అవర్ సమయంలో 1930 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి సైబర్ నేరంపై ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాన్ ఫౌండేషన్ దామరచర్ల మండలం అసోసియేట్ సంజీవరెడ్డి, గ్రామ యువకులు పాల్గొన్నారు.