ఆత్మకూర్.ఎస్‌లో డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ
జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆత్మకూర్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమ్య రెడ్డి మాట్లాడుతూ సమాజంతో మమేకమై..
ఆత్మకూర్.ఎస్, మే 16 : జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆత్మకూర్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమ్య రెడ్డి మాట్లాడుతూ సమాజంతో మమేకమై -డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశ కార్యకర్తలకు, ఆరోగ్య సిబ్బందికి సూచించారు. డెంగ్యూ వైరస్ వ్యాధిని హాని కలిగించే ఎడిస్ ఇజాప్ట్టై (టైగర్) దోమ మన ఇంటి పరిసరాలలో చిన్న చిన్న పాత్రలలో స్థావరం ఏర్పాటు చేసుకొని పగటి పూట కుట్టడం జరుగుతుందని తెలిపారు. వారానికి ఒకసారి ఇంటి పరిసరాల్లో లార్వా (తొక పురుగులు) లేకుండా చేసుకోవాలని, దోమ తెరలు వాడాలని, కిటికీలకు జాలిలు బిగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి చెరుకు యాదగిరి, సూపర్వైజర్ భూతరాజు సైదులు, నర్సింగ్ ఆఫీసర్ మానస, ఫార్మసీ ఆఫీసర్ జానకి, ల్యాబ్ టెక్నీషియన్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Atmakur S
- dengue
- Suryapet News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

