తుంగతుర్తి, జనవరి 24 : రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్ఐ క్రాంతికుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం ద్వారా గ్రామ గ్రామాన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, వాహనదారులు, ప్రజలు పాల్గొన్నారు.