నీలగిరి, ఆగస్టు 04 : తల్లిపాల ప్రాముఖ్యత తెలిసేలా గర్భిణీలకు. బాలింతలకు అవగాహన కల్పించాలని సల్లగొండ ఐసీడీఎస్ సూపర్వైజర్లు పార్వతి, జయమ్మ సిబ్బందికి సూచించారు. సోమవారం పట్టణంలోని 45, 16, 48 వార్డుల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి తల్లులు, గర్భిణీలకు తల్లిపాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిపాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని, పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలన్నారు. అలా పడితేనే బిడ్డ సంపూర్ణ అరోగ్యంతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. శిశువుకు 6 నెలలు నిండిన తర్వాత అదనపు ఆహారం అందిస్తూ రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు పట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంగ, రాజవిలోచన, శ్రీదేవి. వెంకటలక్ష్మి, అండాలు ఆయా సుమలత, ఆశా వర్కర్ ధనలక్ష్మీ, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.
Nalgonda : నల్లగొండ పట్టణంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన