తుంగతుర్తి, జనవరి 17 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు శనివారం మానాపురంనకు వెళ్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రావులపల్లికి చెందిన మహిళా కూలీలు 11 మందితో ఆటో మానాపురానికి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా అదుపుతప్పి రావులపల్లి శివారులోని మూలమలుపు వద్ద బోల్తా పడింది. దీంతో జోగునూరు ఝాన్సీ , జోగునూరి ప్రమీల, జోగునూరు కళమ్మ, బండగొర్ల కాంతమ్మ, ఇంకా కొంతమందికి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.