తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
పోలీస్స్టేషన్లలో నినాదాలు చేశారు. ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల నడ్డి విరిచిందని, తమను ఆరెస్ట్లు చేస్తూ తమ హక్కులను హరిస్తున్నదని వాపోయారు. నల్లగొండ, త్రిపురారం, చందంపేట, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, ఆత్మకూర్.ఎం, చిట్యాల మండలాల నుంచి తరలివెళ్తున్న ఆటోకార్మికులను అరెస్ట్ చేశారు.