చివ్వెoల, మర్చి 25 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని పులితండాలో గల శ్రీ చాంపులాల్ జాతర ఏప్రిల్ 10, 11వ తేదీల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం దుకాణాల నిర్వహణ వేలానికి బహిరంగ వేలం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే జాతరలో కొబ్బరి కాయలు విక్రయించేందుకు జాన్పహాడ్కు చెందిన బానోత్ సురేశ్ రూ.31 వేలకు దక్కించుకున్నాడు.
తలనీలాల సేకరణ హక్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన జగన్నాధం కాటయ్య రూ.28 వేలకు దక్కించుకున్నాడు. వరి పేలాలు ( బొంగులు ), మిఠాయిలు విక్రయించేందుకు సరైన ధర రాకపోవడంతో ఈ నెల 28న మరోసారి వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి స్రవంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ రాజశేఖర్ రావు, ఎంపీఓ దయాకర్, పంచాయతీ కార్యదర్శులు గ్రీష్మ, అరవింద్, విక్రమ్, సైదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.