ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్‌పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి పౌర సమాజం మద్దతుగా నిలిచింది. పాక్ తీవ్రవాదులపై యుద్ధం సాగిస్తున్న భారత వీర జవాన్లకు సంఘీభావంగా శనివారం పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. వీరమరణం పొందిన జవాన్లకు జోహార్లు అర్పించారు. తుంగతుర్తి మండల కేంద్రంలో జీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలు పట్టుకొని సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
అర్వపల్లి మండల కేంద్రంలోని భరద్వాజ ఆశ్రమంలో జవాన్లకు మద్దతుగా సుదర్శన విజయ నరసింహ హోమం నిర్వహించారు. కోదాడ పట్టణంలో వాకర్స్, వాలీబాల్, కబడ్డీ, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, కరాటే క్రీడాకారులు ర్యాలీ నిర్వహించా రు. బస్టాండ్ సమీపంలో గాంధీ విగ్ర హం వద్ద మానవహారం చేపట్టి సైనికులకు మద్దతుగా నినాదాలు చేశారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవరకొండలో డిండి చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యా లీ నిర్వహించారు. పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన అమర జవాన్ మురళీనాయక్‌కు నివాళులర్పించారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.