మునుగోడు, మార్చి 21 : గ్రామాల్లో గర్భిణీలు, బాలింతలకు ఏ ఆపద వచ్చినా అమ్మలా అన్ని తానై చూసుకునే ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ ఆశా యూనియన్ అధ్యక్షురాలు వనం నిర్మల అన్నారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మునుగోడు మండల కేంద్రంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల వైద్యాధికారికి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆశాలను మూడవ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఆశలకు ఎన్ హెచ్ ఎం బడ్జెట్ను పెంచాలని కోరారు. ఈ నెల 24న హైదరాబాద్లో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు మమత, పద్మ, పుష్పమ్మ, కవిత, ధనలక్ష్మి, సైదమ్మ, గంగ, జ్యోతి, మమత, నాగమణి, కమలమ్మ, వసుమతి, వరలక్ష్మి, ధరలక్ష్మి, అలివేలు, లింగమ్మ, ఇందిరమ్మ, కమల, వసంత, సుజాత, రాణి, యాదమ్మ పాల్గొన్నారు.