నీలగిరి, అక్టోబర్ 29: రెండు వేర్వేరు ఘటనల్లో శిశు విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్ తెలిపారు. వారి నుంచి రూ.20 వేల నగదు, ఏడు సెల్పోన్లు, అగ్రిమెంట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. చిన్నారులను శిశు గృహకు, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ..జిల్లా కేంద్రం లో రెండు రోజుల క్రితం 10 రోజుల బేబీని, 21రోజుల బాబు ను అక్రమంగా దత్త త చేసుకున్నారని ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి ఫిర్యా దు మేరకు మూడు టీమ్‌లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి లో విచారణ చేపట్టామన్నారు.
అక్రమంగా దత్తత ఇచ్చి న, దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులను, మధ్యవర్తి త్వం వహించిన డాక్టర్, మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రెండో కేసుల్లో బాలుడి తల్లిదండ్రులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. తిరుమలగిరి సాగర్ మండలంలోని ఎల్లాపురం తండాకు చెందిన కుర్ర బాబు, పార్వతి కూలీ పని చేసుకుంటూ నల్లగొండలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. కుర్రబాబు తాగుడుకు బాని సై కొడుకు కావాలని భార్య పార్వతిని వేధిస్తుండేవాడని తెలిపారు. వారికి మొదట మగ పిల్లగాడు పుట్టి చనిపోగా, తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక, మళ్లీ ఒక ఆడపిల్ల పుట్టి రెండేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిందని తెలిపారు.
మళ్లీ ఆమె గర్భవతి కావడంతో బాబు పుడతాడనుకుని హాలియాలోని నిర్మల దవాఖానలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు. మళ్లీ ఆడపిల్ల పుట్టేసరికి పాపను సాకడం భారమవుతుందని, అదే దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్ శాంతి ప్రియా ద్వారా ఏలూరుకు చెందిన సాంబమూర్తి రజిత దంపతులకు తెలియజేసి, ఈనెల 25 నల్లగొండలో రూ.రెండు లక్షల 30వేలకు దత్తత ఒప్పందం చేసుకొని రూ.10వేలు అడ్వాన్స్‌గా ఇచ్చి పాప చెకప్ మిగతా లీగల్ ప్రాసెస్ అయిన తరువాత డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
గుర్రంపోడ్ మండలంలో..
గుర్రంపోడ్ మండలం కొనాయిగూడానికి చెందిన ఓర్సు శ్రీను మొదటి భార్య సుజాతకు ముగ్గురు పిల్లలు కాగా, వృత్తిరీత్య ఒడిసాకు వలసవెళ్లగా అక్కడ జంకర్ మాలా @ మమతని రెండో భార్యగా వివాహం చేసుకున్నట్లు తెలిపారు. వీరికి ఒక పాప కాగా మరల ఆమె గర్భం దాల్చడంతో పుట్టబోయే బిడ్డను ఎవరికైనా అమ్మి సొమ్ము చేసుకొని తిరిగి ఒడిసా వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిడ్డను తన దూరపు బంధువు, కనగల్ మండలం బోయినపల్లికి చెందిన వేముల నాగరాజు-సువర్ణలకు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
నల్లగొండలో ఈనెల 8న మమత డెలివరీ కాగా మగబిడ్డ జన్మించినట్లు తెలిపారు. మగబిడ్డ పుట్టడడంతో రూ.ఆరు లక్షలకు డిమాండ్ చేసి, రూ.4.5 లక్షలకు ఒప్పందం చేసుకొని డబ్బులు తీసుకొని డిచార్జీ అనంతం బిడ్డను వారికి అప్పడించి ఒడిసాకు వెళ్లిపోయినట్లు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి ఇద్దరిని శిశుగృహకు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి, సీడబ్ల్యుసీ చైర్మన్ చింత కృష్ణ, డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కేసాని గణేశ్ గౌడ్, సీఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, గోపాలరావు, సైదులు, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి, సిబ్బంది రబ్బాని, షకీల్, కిరణ్, అంజి, ఫారుక్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.