యాదాద్రి: నాయీ బ్రాహ్మణ, రజక కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత తమ ఆరాధ్య దైవం, ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని నాయీ బ్రాహ్మణ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ అన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఆదు కునే విధంగా హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళవారం పాదయాత్రగా వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి వైకుంఠ ద్వారం వద్ద 500 కొబ్బరికాయలు కొట్టి మొక్కుల తీర్చుకున్నాడు.
కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నాయీ బ్రాహ్మణులు, రజకులకు కటింగ్ సెలూన్, లాండ్రీలకు 250 యూనిట్లకు ఉచి తంగా విద్యుత్‌ను అందించేందుకు వీలుగా రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ లకు రూ. 198 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కేసీఆర్‌కు కృతజ్ఞతగా స్వామి వారికి మొక్కులు తీర్చుకోవడంతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుమలదాస్ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి దుబాయి నర్సింగ్, మీడియా సెల్ కన్వీనర్ పయ్యావలు సంతోష్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్వాయి శ్రీకాంత్, మేడ్చల్ జిల్లా ప్రధా న కార్యదర్శి గడియారం రామకృష్ణ, భువనగిరి పట్టణ అధ్యక్షుడు పత్తేపురం మహేందర్, ప్రధాన కార్యదర్శి ప్రేంకుమార్, భూదాన్ పోచంపల్లి మండల ఉపాధ్యక్షుడు రాసమల్ల వెంకటేశ్, అబ్ధులాపూర్మెట్ మండల ఉపాధ్యక్షుడు పేరుకు కృష్ణ, జిల్లా నాయకులు సంగం దశరథ, పయ్యావుల నర్సింహ్మ, కెర్లాపు వెంకటేశ్, జంపాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.