రామగిరి, జూన్ 30 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పార్ట్ టైం అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 15లోగా ఆయా విభాగాల్లో పీజీలో 55 శాతం మార్కులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత కళాశాలలో యూనివర్సిటీ పనిదినాల్లో అందచేయాలని సూచించారు. అయితే నెట్, సెట్, ఎంపీల్, పీహెచ్డీ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
రసాయన శాస్త్రం- 01, వృక్షశాస్త్రం- 01, ఫిజిక్స్- 02, ఎంఏ తెలుగు- 01, సైకాలజీ- 01, ఎంసీఏ- 02, ఇంజినీరింగ్ ఈఈఈ- 01, ఈసీఈ- 01, సీఎస్ఈ- 01 మొత్తం 12 మంది పార్ట్ టైం అధ్యాపకులను నియమిస్తున్నట్లు తెలిపారు. అర్హులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఎంజీయూలో ఉన్న స్క్రాప్ మెటిరియల్ వేలంను జూలై 3న నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగే వేలంకై ఆసక్తి గల వారు, ఏజెన్సీలు నిర్దేశిత సమయంలో హాజరై వేలంలో పాల్గొనాల్సిందిగా సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొ.ఆకుల రవి 9948361250 నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.