నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 26 : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కృషి చేస్తున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కోటయ్య, సీనియర్ అధ్యాపకుడు లింగారెడ్డి తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు దీటుగా విద్యాబోధన సాగిస్తున్నట్లు చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో దోస్త్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొంటూ సోమవారం దేవరకొండ, కొండమల్లేపల్లి, గుడిపల్లి మండలాల్లో బ్యానర్స్ కడుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలకు న్యాక్ B ++ గుర్తింపు ఉన్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధిస్తూ తమ విద్యార్థులు తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల్లో సీట్లు సాధిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఐసెట్ లో సైతం ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభ చూపుతున్నారని, ఇది తమ అధ్యాపకుల బోధనకు నిదర్శనం అన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులంతా ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ ద్వారా అడ్మిషన్లు పొందాలని సూచించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్తో పాటు క్రీడలు ఇతర యాక్టివిటీస్ తమ కళాశాల ప్రత్యేకతలుగా వారు పేర్కొన్నారు.
B.Com CA (EM), BA EHP(TM & EM), B.Sc BZC, B.DC M.PCS(EM)
పూర్తి వివరాలకు 9951213860, 9392456346 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని తెలిపారు.