నల్లగొండ సిటీ, జనవరి 22 : 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి కోసం అలాగే ఎస్సీ, ఎస్టీ గురుకుల్లాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీల ప్రవేశం కోసం ఆన్లైన్ విధానం దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించబడిందని యాదాద్రి జోనల్ ఆఫీసర్ ఎస్.విద్యా రాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.