‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ పోరాట సంఘాల కమిటీ (USPC) నాయకులు డిమాండ్ చేశారు. SIR ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని...
– ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
– నల్లగొండలో ఉపాధ్యాయ పోరాట సంఘాల కమిటీ ఆధ్వర్యంలో నిరసన
రామగిరి, అక్టోబర్ 10 : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ పోరాట సంఘాల కమిటీ (USPC) నాయకులు డిమాండ్ చేశారు. SIR ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ నల్లగొండలోని గడియారం కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా USPC నాయకుడు నర్రా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలని అన్నారు. ఎన్నికల ఫారం-6లో తీసుకొచ్చిన కొత్త నిబంధనలను రద్దు చేయాలని, 2023లో ఎన్నికల కమిషనర్లకు రక్షణ కల్పించే చట్టాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని, 2024 తర్వాత జరిగిన ఎన్నికలపై సమీక్ష చేపట్టాలని కోరారు. ఓటరు జాబితాల నుంచి తొలగించబడినట్లు పేర్కొంటున్న ఓటర్ల పేర్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, భవిష్యత్‌లో ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై న్యాయ విచారణ జరిపించాలని కోరారు.
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, పేదలు, కార్మికులు, వలస కార్మికులు సహా అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని నాయకులు పేర్కొన్నారు. SIR ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, అర్హులైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై నిష్పాక్షిక విచారణ జరిపి, ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనలో పాల్గొన్న USPC నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో DTF అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశం, నాగయ్య, వెంకులు, ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు రాములు, TSUTF జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, పగళ్ళ సైదులుతో పాటు వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

