చండూరు, ఏప్రిల్ 14 : భారతదేశాన్ని లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనది అని, బాబాసాహెబ్ స్ఫూర్తితోనే భారతదేశంలోని సబ్బండ వర్గాలకు న్యాయం చేకూరుతుందని ఏసీపీ చెడుబుద్ది మహేశ్వర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బస్టాండ్ ఆవరణలోని బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అదేవిధంగా బీజేపీ చండూరు మండలాధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇరిగి బుచ్చయ్య, బొడ్డు సతీశ్ గౌడ్, పోలే లోకేశ్, పాలకురి రాములు, గండు వెంకట్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు నకిరేకంటి లింగస్వామి గౌడ్, బూతరాజు శ్రీహరి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్ రెడ్డి, మండల నాయకులు శివర్ల యాదయ్య, చెరుకు లింగయ్య, జెట్టి యాదయ్య, నలపరాజు యాదగిరి, మాదగోని వెంకన్న, ఇరిగి శివ, ఐతగోని శ్రీనివాస్, గుండెబోయిన దిలీప్, పులిజాల రవీందర్, ముక్కాముల సైదులు, నకిరేకంటి రఘు గౌడ్, బోయపల్లి సత్తయ్య, బోయపల్లి శంకరయ్య గౌడ్, పోలె నరేశ్, ఇరిగి శివ, చెడుబుద్ధి అనిల్, రవి, బొడ్డు రాములు, స్వామినాద్, మద్దుముకమల చంద్రయ్య, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.