పెన్‌పహాడ్, ఏప్రిల్ 14 : అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. బడుగుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అన్నారు.
రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహా నాయకుడు అని కొనియాడారు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్ప నాయకుడు అన్నాఉ. సమాజంలో ఎలా నడుచుకోవాలో రాజ్యాంగంలో క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కాస్తాల గోపికృష్ణ, యూత్ అధ్యక్షుడు గాలి మురళి, మార్కెట్ కమిటీ డెరైక్టర్ దామోదర్‌రెడ్డి, చెన్నూ రమణారెడ్డి, లక్కపాక నర్సయ్య. నాగార్జున. శ్రీనాథ్. రాజు, గాలి మహేశ్ పాల్గొన్నారు.