కట్టంగూర్, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కట్టంగూర్ లోని అంబేద్కర్ నగర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, విగ్రహావిష్కరణకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపర్చిన హక్కులు, రిజర్వేషన్ల వల్లే బడుగు, బలహీన వర్గాల వారు ప్రజా ప్రతినిధులు అవుతున్నారని, ఉద్యోగావకాశాలు పొందుతున్నారన్నారు. వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పాటుపడిన మహోన్నతుడు బాబాసాహెబ్ అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగంలోని అర్టికల్-3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశానికి రాజ్యాంగం రచించి, దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వంతో పాటు పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు అంబేద్కర్ కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పూజర్ల శంభయ్య, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, శ్యామల శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, మేడి ఇద్దయ్య, గద్దపాటి దానయ్య, మేడి విజయ్ కుమార్, రెడ్డిపల్లి సాగర్, మర్ర రాజు, మేడి విజయ్ కుమార్, మాద పద్మ, అయితగోని నర్సింహ్మ, ఝాన్సీ, గట్టిగోర్ల సత్తయ్య, ముక్కామల శేఖర్, అయితగోని నారాయణ, బుచ్చాల వెంకన్న, మిట్టపల్లి శివ, బొజ్జ శ్రీను, బూరుగు శీను, దార భిక్షం పాల్గొన్నారు.