నల్లగొండ రూరల్, డిసెంబర్ 23: దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియం ఎదుట ఎస్ఐ,కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దేహ దారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు పౌష్టికాహారం పంపిణీ చేసి మాట్లాడారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సేవా చేసేందుకు గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుటుందన్నారు. జనవరి 4 వరకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యామ దయాకర్, దుబ్బ అశోక్ సుందర్, కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి, ఐతగోని స్వామి గౌడ్, మధుసూదన్‌రెడ్డి, హరికృష్ణ, నూనె రవీందర్, చిలుకరాజు శ్రీనివాస్, బషీరోద్దీన్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.