సూర్యాపేట, అక్టోబర్ 10 : సోమవారం నాటికి సూర్యాపేట జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఖరీఫ్ 2025-26 సీజన్ కి సంబంధించి ధాన్యం సేకరణపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతానికి జిల్లాలో 298 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలుగకుండా మౌళిక వసతులు ఏర్పాటు చేసి సోమవారం లోపు ప్రారంభించాలన్నారు. ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ సమావేశానికి డీఎస్ఓ మోహన్ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, ఏపీడీ సురేష్, ఏడీఎం బెనర్జీ, ఏఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.