చండూరు , మార్చి 27 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యంగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆసరా పింఛన్లను రూ.4 వేలు చేయాలన్నారు. గురువారం చండూరు మున్సిపల్ పరిధిలోని 2, 5, 6వ వార్డుల్లో అర్హులైన పెన్షన్‌దారులు, మహిళల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోటికొచ్చిన హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల గడుస్తున్నా ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో అర్హులందరితో కలిసి తాసీల్దార్ కార్యాలయం ఎదుట త్వరలో ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టి, మొండి చెయ్యి చూపెడుతున్న కాంగ్రెస్ పాలనపైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమ నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు భూతరాజు శ్రీహరి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపర్తి యాదగిరి, 214 బూత్ అధ్యక్షుడు బోడ ఆంజనేయులు, మున్సిపల్ నాయకులు సోమ శంకర్, వేముల పవన్ కళ్యాణ్, తడకమళ్ల శ్రీధర్, చిట్టిప్రోలు వెంకటేశం, భూతరాజు స్వామి, ఇరిగి ఆంజనేయులు, గండు శ్రీకాంత్, పున్న అరుణోదయ, నరసింహ, రాము, సోమ రాజు పాల్గొన్నారు.