రామగిరి, జూన్ 18 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ, డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర్ష తెలిపారు. కళాశాలలో బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్), (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ లైఫ్ సైన్సెస్ లో (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ), (మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ), బీకాం (బిజినెస్ అనలైటిక్స్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బిఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్) కోర్సుల్లో షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ), షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వాస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 21వ తేదీ లోపు కళాశాలలో సంప్రదించాల్సిందిగా సూచించారు. ఆసక్తి గల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 2026 జనవరి తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ జిరాక్స్, ఇంటర్మీడియట్ టీసీతో పాటుగా రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ తో నేరుగా కళాశాలలో హాజరై అడ్మిషన్లు పొందవచ్చునని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10:00 నుండి సాయంత్రం 4 గంటల వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.