పెన్పహాడ్, మార్చి 28 : రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలకు దూరం ఉండొచ్చొని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తాల గోపికృష్ణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం మండల పరిధిలోని అనంతారం గ్రామంలో జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించి మాట్లాడారు. వాహనదారులు ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు, హెల్మెట్ తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను వెంట తీసుకెళ్లాలని చెప్పారు. కండీషన్లో ఉన్న వాహనాలనే డ్రైవింగ్ చేయాలన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించడం, సెల్ఫోన్ మాట్లాడడం హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకూడదని చెప్పారు. అనంతరం నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.