ఒక్కో నేత.. ఒక్కో మాట!
సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి కంపెనీకి రూ.200కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టిబెట్టి కాంగ్రెస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందనే బీఆర్ఎస్ ఆరోపణలపై అధికార పార్టీ నేతలు ఒక్కో తీరుగా స్పందించడం విస్తుగొల్పుతున్నది.
- సీఎం సోదరుడి కంపెనీకి భూమి కేటాయింపుపై తలోమాట
- తప్పేంది? రేవంత్ కుటుంబం బాగుపడొద్దా?: ఎంపీ చామల
- అర్హులైతే ఇచ్చేస్తాం.. తప్పేంది? : ఎంపీ మల్లు రవి ప్రశ్న
- సీఎం సోదరుడికి భూములే ఇవ్వలేదు : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి కంపెనీకి రూ.200కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టిబెట్టి కాంగ్రెస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందనే బీఆర్ఎస్ ఆరోపణలపై అధికార పార్టీ నేతలు ఒక్కో తీరుగా స్పందించడం విస్తుగొల్పుతున్నది. ప్రధాన ప్రతిపక్షం బీ ఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టలేక, నిజం దాచలేక తలోమాట మాట్లాడుతున్నారు. అవును భూమి కేటాయిస్తే త ప్పేంటని ఒకరంటే, అసలు భూమే కేటాయించలేదని మరొకరు చెప్తున్నారు. ఇం కొకరేమో అసలు సీఎం సోదరుడికి కంపెనీనే లేదని తేల్చేస్తున్నారు.
ఇలా సీఎం మెప్పు పొందేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ… సీఎం సోదరుడు పేరుపై టీజీఐఐసీ నుం చి ఒక్క ఇంచు భూమి కూడా కేటాయించలేదని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ఎం పీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ.. తక్కువ పెట్టుబడితోని కొత్త కంపెనీ పెట్టుకొన్న వారికి భూమి కేటాయిస్తే ఇం త రాద్ధాంతం చేస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. ‘అందరికీ కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. రేవంత్‌రెడ్డి కుటుంబం బాగుపడొద్దా.. ఉద్యోగం చేసుకోవద్దా, వ్యాపారం చేసుకోవద్దా’ అంటూ ప్రశ్నించడం గమనార్హం.
అయి తే కొండల్‌రెడ్డి కంపెనీగా చెప్పుకొంటున్న టెస్సెరాక్ట్ కంపెనీ భూమి పొందేందుకు అన్ని విధాలుగా అర్హత ఉన్న కంపెనీ అని మాత్రం చెప్పడం లేదు. ఎంతసేపూ నిబంధనల ప్రకారమే భూములు కేటాయించామని చెబుతున్నారే తప్ప.. అ కంపెనీ అర్హతలను మాత్రం వెల్లడించడం లేదు. అంటే ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని సీఎం కుటుంబం బాగుపడాలన్నది ఆయన ఉద్దేశమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. అన్ని అర్హతలు చూసిన తర్వాతే సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి కంపెనీకి భూములు కేటాయించినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

