గరిడేపల్లి, జనవరి 26 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని శీత్లాతండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాల వారు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణానాయక్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందిందన్నారు. పార్టీలో చేరిన వారిలో గుగులోతు నాగేందర్, హరిచంద్రు, రవి, బాబ్లా, ఉపేందర్, సుమన్, సైదులు, పలువురు కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఏఎంసీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ శీత్లాతండా గ్రామాధ్యక్షుడు బాబూనాయక్, ప్రధాన కార్యదర్శి బాలూనాయక్, నాయకులు శంకర్‌నాయక్, హుస్సేన్, సైదా, భీముడు, కోటి, శ్రీరామ్ పాల్గొన్నారు.