చందంపేట, సెప్టెంబర్ 16 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రభుత్వ ఆదేశానుసారం మెనూ పాటించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా మెనూ తప్పకుండా పాటించాలని ఎస్ఓ జ్యోతికి సూచించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలన్నారు. మధ్యాహ్న సమయంలో వారానికి రెండుసార్లు మండల స్థాయి అధికారులు సందర్శించనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.