మునుగోడు, సెప్టెంబర్ 25 : మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసి మునుగోడు అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన శిలా ఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు కక్షపూర్తిగా ధ్వంసం చేశారు. ఇట్టి విషయంపై తగిన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మండల పార్టీ ఆధ్వర్యంలో గురువారం మునుగోడు ఎస్ఐకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందుల సత్యం మాట్లాడుతూ.. శిలా ఫలకాలను కూల్చిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొరటికల్ గ్రామ శాఖ అధ్యక్షుడు అయితగోని శేఖర్, మాజీ సర్పంచ్ ఎల్లంకి యాదగిరి, నాయకులు పొలగోని సైదులు గౌడ్, మారగోని అంజయ్య, గజ్జెల బాలరాజు, ఐతగోని విజయ్,శరత్ బాబు, దోటి కరుణాకర్, జిల్లా నాయకులు బేరి గురుపాదం, ఐతరాజు పర్వతాలు, అయితగోని మల్లేష్, శీర్గమల్ల అంజయ్య, యువజన నాయకులు ఐతరాజు శ్రీశైలం, రొమ్ముల రవి, రవి, హరిబాబు పాల్గొన్నారు.