పెన్పహాడ్, ఆగస్టు 02 : బంగారం చోరీ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గడిచిన జూలై 28వ తేదీన చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామానికి చెందిన ధరావత్ మణిరామ్. పెన్పహాడ్ మండలం మేఘ్యతండా గ్రామ పంచాయతీ కేవ్లాతండాకు చెందిన లకావత్ లక్పతి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోని తులం బంగారం. రూ.5 వేల నగదు అపహరించి పారిపోయినట్లు తెలిపాడు. బాధితుడు లక్పతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. శనివారం నిందితుడిని తుల్జారావుపేటలో తన ఇంట్లో ఉండగా అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును రికవరీ చేసి రిమాండ్కు పంపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ గోపికృష్ణ, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.