నీలగిరి, అక్టోబర్ 8: నల్లగొండలో మంగళవారం కలకలం సృష్టించిన మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిం దితులపై అత్యాచారంతో కూడిన నేర పూరిత హత్య, పోక్సో కేసు నమోదు చేసి, వారి నుంచి బైక్, ఆటో, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి వెల్లడించారు.
బుధవారం నల్లగొండ 2 టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఉం టున్న గ్రామంలో నిందితుడు గడ్డం కృష్ణ మూడు నెలల క్రితం ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని మాయ మాటలు చెప్పి, ప్రేమ పేరుతో దగ్గరై, ఇన్స్టాగ్రామ్ ద్వారా చాట్ చేసేవాడన్నారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయం లో బాలిక గ్రామం నుంచి కాలేజీకి రెగ్యులర్‌గా వెళ్లే ఆటోలో బయలుదేరి నల్లగొండకు వచ్చింది.
కాగా అమెను గడ్డం కృష్ణ బైక్‌పై తనవెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించిట్లు తెలిపారు. అయితే బైక్‌పై ఎకించుకొని వెళితే ఎవరైనా చూస్తారని గ్రహించి తన స్నేహితుడైన బచ్చలకూరి మధు ఆటోలో ఆమెను ఎకించినట్లు తెలిపారు. బాలికను పట్టణంలోని షంషునగర్, రోడ్ నంబర్-8లో మధు కిరాయికి ఉండే గది వద్ద వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బైక్‌పై ముందుగానే మధు గది వద్దకు చేరుకున్న గడ్డం కృష్ణ బలహీనంగా ఉన్న బాలికను బలవంతంగా, శారీరకంగా కలిసినట్లు తెలిపారు. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమై ఒకసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయినట్లు వివరించారు.
అది చూసి కృష్ణ వెంటనే గదికి తాళం వేసి పారిపోయి, తనకు తెలిసిన వ్యక్తికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అ వ్యక్తి ద్వారా పోలీసులకు సమాచారం తెలియడంతో కేసు విచారణ చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం సమయంలో నేరస్తుడు కృష్ణ పోలీసు స్టేషన్లో తాను చేసిన నేరం ఒప్పుకొని లొంగిపోయినట్లు తెలిపారు. అతడిని, మధును పూర్తిగా విచారించినట్లు తెలిపారు. బాలిక మృతదేహానికి టీమ్ అప్ డాక్టర్లచే శవపరీక్ష నిర్వహించి సాంకేతిక పరిజ్ఞానం, డాక్టర్ల సలహా మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఈ కేసును త్వరితగతిన విచారించి, కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. అంతేగాకుండా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ సూచించారు. కేసును తన పర్యవేక్షణలో వేగవంతంగా దర్యాప్తు చేసిన సీఐలు రాఘవ రావు, రాజశేఖర్ రెడ్డి, టూటౌన్ ఎస్ఐ సైదులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించినట్లు తెలిపారు.