కట్టంగూర్, నవంబర్ 30 : నకిరేకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. అన్ని గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2.50,547మంది ఓటర్లగాను 2,17,149ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1,09, 585 మంది పురుషులు, 1,07, 562 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా నియోజవర్గంలో86.67 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు.
నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో బీఆర్ ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నార్కట్‌పల్లి లో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి వేముల వీరేశం, నకిరేకల్ మండలం పాలెంలో గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బా లరాజు, నకిరేకల్‌లో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విదా ్యసాగర్, చెర్వుగట్టులో జిల్లా గ్రంథాలయ సంస్థ రేగట్టె మల్లి కార్జున్రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియో గించుకున్నారు.
కట్టంగూర్ : మండలంలోని 22 గ్రామపంచాయతీలతో పాటు 22 ఆవాస గ్రామాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 36,642 మంది ఓటర్లు ఉండగా అందులో 32,439 మంది తమ ఓటు హ క్కును వినియోగించుకున్నారు. మండలంలో 88.52 శాతం ఓట్లు పోలైనట్లు తాసీల్దార్స్వప్న తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం కట్టంగూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సరళిని పరిశీలించారు.
నకిరేకల్ : మండలంలోని 17 గ్రామపంచాయతీలతో పాటు మున్సిపాలిటీలో ఉదయం బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 49, 812 మంది ఓటర్లు ఉండగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో శాతం పోలింగ్ నమోదైనట్లు సహాయ రిటర్నింగ్ అధికారి గుగులోతు ప్రసాద్ నాయక్ తెలిపారు.
చిట్యాల : మండలంలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1,2 గ్రామాల్లో ఇరుపక్షాల నడుమ చిన్న చిన్న వాగ్వాదాలు తప్ప మరెలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. సీఐ మహేశ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు రవి, నవీన్ గ్రామాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సుంకెనపల్లిలో వీవీ ప్యాట్, ఎలికట్టె గ్రామంలో ఈవీఎంలు కొద్ది సేపు మొరాయించాయి. మొత్తం 46,831 మంది ఓటర్లు ఉండగా 23,358 మంది పురుషులు, 23,473 మంది మహిళలు ఉన్నారు. 52 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా 40,894 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేతేపల్లి : మండలంలోని మండల మొత్తంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 30,470 మంది ఓటర్లున్నారు. వీరిలో 15,508 మంది మహిళా ఓటర్లు కాగా, 14,962 మంది పురుషులు ఉన్నారు. వీరిలో ఆయా గ్రామాల్లో మొత్తం 26,750 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఆయాగ్రామాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 35 ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోలింగ్ ఊపందుకుంది. మండల కేంద్రంలో జరిగిన పోలింగ్ విధానాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు.మండలంలోని చెర్కుపల్లి, తుంగతుర్తి గ్రా మాల్లో ఎన్నికల పోలింగ్ సరళిని శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, తుంగతుర్తి, భీమారం గ్రామాల్లో రాష్ట్ర షీప్స్ అండ్ గొట్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పరిశీలించారు.
శాలిగౌరారం : మండలంలో మొత్తం 39,386 ఓట్లు ఉండగా అందులో పురుషులు 19,642, మహిళలు 19,741 మంది, 3 ముగ్గురు ఇతరులు ఉన్నారు. ఓటర్లకు అనుగుణంగా 52 బూత్‌లను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో చెదురు, మదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తిరుమలరాయినిగూడెంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి పోలింగ్ కేం ద్రాన్ని సందర్శించి ఓటర్ల సరళిని పరిశీలించారు. మా ధారం కలాన్, బాలిశెట్టిగూడెం గ్రామాల్లో పోలింగ్ బూత్‌లను ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ సందర్శించారు.
మండలంలోని మాధారం కలాన్‌లో నిర్వహిస్తున్న పోలింగ్ బూత్‌ను సందర్శించేందుకు ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ వచ్చారు. దాంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆక్షేపం తెలిపారు. ఎమ్మెల్యే సందర్శించి బయటికి వెళ్లిన అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగి తోపులాట జరిగింది. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీస్ సిబ్బంది ఇరు వర్గాలను అదుపు చేసి సర్ది చెప్పారు. పెర్కకొండారంలో మొరాయించిన ఈవీఎం పెర్కకొండారం గ్రామంలో పోలింగ్ బూత్ నంబర్ 106లో ఈవీఎం మొరాయించినట్లు తెలిపారు. దాంతో ఓటర్లు సహనం కోల్పోయి నిరీక్షించాల్సి వచ్చింది. తదుపరి ఈవీఎం సరికావడంతో ఆలస్యంగా పోలింగ్ ముగిసింది.
రామన్నపేట : మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో 59 పోలింగ్ కేంద్రాల్లో 37,929లో మంది ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.85 శాతం నమోదైంది. నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థ్ధి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలిగ్ సరళిని పరిశీలించారు. అవాం ఛనీయ సంఘటనలు జరుగకుడా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.