సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం మేధా స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్సీ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. పీఎస్ఆర్ సెంటర్లోని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సైన్స్ ఫెయిర్ జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మందారపు వెంకట రమణి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తమ నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని చెప్పారు. ఆరవ తరగతి విద్యార్థిని ఫిక్స్డ్ కాల్స్ మెసేజ్ (తమ చేతి వినికిడి ద్వారా వెలుగుతున్నకాంతి) అనే ప్రోగ్రాం నిర్వహణ అందరిని ఆకట్టుకుంది అన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి మున్ముందు ఆ నైపుణ్యం సమాజానికి తోడ్పడేలా కృషి చేయాలన్నారు .ఇలాగే తమ విద్యార్థులు ప్రతిభను చాటి ముందుకు నడవాలని ఆకాంక్షించారు.