అనంతగిరి, జూలై 14 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రతిపక్ష నాయకులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని వెంటనే ఆయనపై కేసు నమోదు చే యాలని అనంతగిరి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు నల్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే.. కరు వు సమస్య తీరాలంటే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, తెలంగాణ రైతుల రక్తాన్ని పొ లాల్లో చల్లాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నాయకులు తమ ఒం టికి బండ రాయి కట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో దూకి చావాలి అంటూ సీఎం మాట్లాడడం ఆయన అధికార దురహంకారానికి నిదర్శనమన్నారు. ఇలాంటి తీవ్ర పదజాలం ఉపయోగించిన రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మట్టపల్లి పుల్లయ్యగౌడ్, అప్జల్, సీనియర్ నాయకులు పందిరి వీరయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు ఛార్లెస్, కంటు శ్రీకాంత్, కాకాని వెంకటేశ్వర్లు, దొంగరి నాగేశ్వరరావు, యాకూబ్ పాషా, ఉదయ్ పాల్గొన్నారు.
మోతె, జూలై 14: సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నాయకులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, వెంటనే ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని మోతె మండలం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్సై లచ్చిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్ మాట్లాడుతూ.. సూపర్ ఎల్‌నివో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండక రైతు లు దిక్కుతోచక ఆగమ్యగోచరంగా ఉంటే ముఖ్యమంత్రి విడ్డూరంగా మాట్లాడుతూ కరువు సమస్య తీరాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యులు, యావత్ తెలంగాణ రైతుల రక్తాన్ని పొలాల్లో చల్లాలి అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులు ఒంటికి బండరాయి కట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో దూకి చావాలి అని అనడం ఆయన అధికార దురంహకారానికి పరాకాష్ట అన్నారు. ఇలాంటి తీవ్ర పదజాలం వాడిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, నాయకులు బాణోతు దేవులా నాయక్, భూక్యా గాంధీబాబు, శ్రీను, లింగయ్య, వెంకటేశ్వర్లు, నవీన్, నరేశ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.